2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని, జిల్లాలు సరిహద్దులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు అవుతుందనే ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం రేవంత్

ఇప్పటివరకు జిల్లాల మార్పు గురించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం గురించి, రద్దు చేయడం లేదా సరిహద్దుల మార్పుకు సంబంధించిన అంశాల గురించి ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జనగణన ప్రక్రియ జరుగుతున్న కారణంగా, ఈ సమయంలో మార్పులు చేర్పులు చేయకూడదని కేంద్రం సూచించిందని, జనగణన పూర్తయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

CM Revanth Reddy clarifies Telangana will not abolish create new districts till march 31st 2027

అప్పటివరకు జిల్లాల హద్దులు మార్చే అవకాశం లేదు

కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 2027 వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మార్చకూడదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ గడువు ముగిసిన వెంటనే, జిల్లాల పునర్విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన ప్రస్తుతం తమ ప్రభుత్వ పరిశీలనలో లేదు

ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. జరుగుతున్న ప్రచారం అసత్య ప్రచారం అన్నారు. ఏ జిల్లాలను తొలగించడం కానీ, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు.

ప్రజలకు బహిరంగంగా చెప్పి చేస్తాం

ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయాల్సివస్తే ప్రజలకు బహిరంగంగా చెప్పి మరీ చేస్తామని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించిన భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, దుష్ప్రచారాలు నమ్మరని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం పది జిల్లాలు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పాలనా సౌలభ్యం కోసం నాడు కేసీఆర్ ప్రభుత్వం పది జిల్లాలను కొత్తగా మరో 21 జిల్లాలతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ తర్వాత ప్రజల డిమాండ్ల మేరకు, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను కూడా ఏర్పాటు చేశారన్నారు.

శాస్త్రీయ విభజన జరగక క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజలు ఇబ్బంది

దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి చేరిందని అయితే ఈ జిల్లాలో విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేస్తుందని, మార్పులు చేర్పులు చేస్తుందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+