సీఎం రేవంత్ రెడ్డి చేతల మనిషేనా? తాజా నిర్ణయంతో హరీష్ రావుకు షాక్!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు ఏ మాత్రం తావివ్వటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన నాటినుండి పరిపాలనపై తనదైన మార్కు వేస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల నోళ్లు మూతపడేలా చేస్తున్నాయి.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి శుభవార్త చెప్పారు. రేవంత్ ఆదేశాలతో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించనున్నారు అధికారులు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని నేటి నుండి పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్ ను టార్గెట్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారన్నారు.
పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగం తమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై సీతక్క వంటి వారి కౌంటర్ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా పనిచేసుకుపోయారు. పాలన మొదలైన వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయం అందించాలని రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించి హరీష్ రావు నోరు మూతపడేలా చేశారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications