తెలంగాణ అంటే మోడీకి వివక్ష కాదు.. : ఏపీకి కేటాయింపులపై రేవంత్ ఏమన్నారంటే?
ఈరోజు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలకు ముందు 18 సార్లు ఢిల్లీకి వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రులను కలిశామని చెప్పారు. తాన స్వయంగా మూడుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ గతంలో తప్పుబట్టారని రేవంత్ తెలిపారు. ఇప్పుడు తెలంగాణకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు.

ప్రధానికి తెలంగాణపై వివక్ష అనుకున్నాం.. కానీ, కక్ష పూరితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏపీకి భారీగా నిధులు ఇచ్చారని.. అయితే, తాము ఎందుకిచ్చారని అడగమని.. కానీ, తెలంగాణకు ఎందుకివ్వరని ప్రశ్నిస్తామని అన్నారు. తెలంగాణలో మెట్రోకు నిధులు ఇవ్వలేదని, ఐటీఐఆర్ ప్రస్తావనే లేదని మండిపడ్డారు. తెలంగాణ పదం కూడా కేంద్రానికి ఇష్టం లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణకు మేలు జరుగుతుందని తాను మొదట్లో కేంద్రానికి సానుకూలంగా ఉన్నామని.. ప్రధానిని పెద్దన్న అనుకున్నామని కానీ.. అలా జరగలేదన్నారు. తెలంగాణ మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిదే బాధ్యత అని రేవంత్ అన్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు ఇచ్చారరని సీఎం రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ పౌరులుగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలన్నారు. బానిసనలుగా ఉండొద్దని సూచించారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలని అడిగితే.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవ్వమని తేల్చి చెప్పారని అన్నారు.
పోలవరంకు కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్రం.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఏపీ పునర్విభజన చట్టం అంటే ఏపీకే కాదు.. తెలంగాణకు కూడా వర్తిస్తుందని అన్నారు. తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అన్నారు. మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరిపి.. మిగితా రాష్ట్రాలకు మొండిచూపారని మండిపడ్డారు.
ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ సవరింపులో తెలంగాణకు నిధులు కేటాయించాలని రేవంత్ కోరారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలో తెలంగాణకు జరిగిన అన్యాయం పోరాటం చేస్తారన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications