క్రిస్మస్ కానుకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 33 కోట్లతో వారి కోసం!

తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేయడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన అధికారిక ఉత్సవాలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా ప్రకటించారు.

ప్రతి చర్చికి 30 వేల రూపాయల నిధులు
రాష్ట్రవ్యాప్తంగా 7000 చర్చిలకు క్రిస్మస్ ఖర్చుల నిమిత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించినట్టు దీపక్ జాన్ తెలిపారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

CM Revanth Reddy gave a Christmas gift allocating Rs 33 crore for them

డిసెంబర్ మంత్ మిరాకిల్ మంత్ అన్న రేవంత్ రెడ్డి
క్రిస్మస్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ డిసెంబర్ మంత్ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.డిసెంబర్ మంత్ కి చాలా ప్రాధాన్యత ఉందని, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డిసెంబర్లోనే పుట్టారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

రాష్ట్రంలో వారిపై చర్యలు తప్పవు.. రేవంత్ హెచ్చరిక
ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ త్యాగం వెలకట్టలేనిది అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏసుప్రభు బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం
త్వరలో అసెంబ్లీ సమావేశాలలో ద్వేషపూరిత ప్రసంగాలు నివారణకు హేట్ రేట్ చట్టం ప్రవేశ పెడతామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలో వైద్య విద్య అభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీల కృషి అపారంగా ఉందని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి సగటు మనిషి జీవన ప్రమాణాలను పెంచడంలో వారి పాత్ర కీలకం అంటూ ప్రశంసించారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+