Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త: వారికి ఇళ్ళస్థలాలు!!

తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

నిన్న సాయంత్రం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు రేవంత్ రెడ్డిని కలిసిన క్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ సొసైటీకి కేటాయించిన ఇళ్లస్థలాలు అప్పగింత ప్రక్రియను వందరోజులలో మొదలుపెడతామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

CM Revanth Reddy good news for journalists: Housing sites for them!!

16 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో 70 ఎకరాల స్థలాన్ని జర్నలిస్తులకు కేటాయించారని, కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఇళ్ళ స్థలాల అప్పగింత జరగలేదని వారు సీఎం రేవంత్ రెడ్డి తో తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా ఆ స్థలాలను తమకు అప్పగించలేదన్నారు.

ఇక జర్నలిస్టులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఇంటి స్థలాల అప్పగింతపై రోడ్డు మ్యాప్ తో తన వద్దకు వస్తే ఒక్క నిమిషంలో సంతకం పెడతానంటూ వారికి హామీ ఇచ్చారు. ఏ సంస్థకు నామినేటెడ్ చైర్మన్ నియమించకుండా, కేవలం మీడియా అకాడమీకే మొదట నామినేటెడ్ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డిని నియమించాం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో గమనించాలని ఆయన పేర్కొన్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉన్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇస్తామని సీఎం రేవంత్ తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కార్డులతో పాటు, జర్నలిస్టుల సమస్యల పైన కూడా దృష్టి సారించామని పేర్కొన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.

ఇక సీఎం ఆదేశాల ప్రకారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ తాజా ప్రకటన నేపధ్యంలో జర్నలిస్టులకు మళ్ళీ ఇళ్ళ స్థలాల విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+