భరత్ అనే నేను.. పాట బీజీఎంతో సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి హల్చల్!!
తెలంగాణ రాష్ట్ర సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తనదైన శైలిలో పనిచేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందులో భాగంగా తొలి రోజు ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇక ఒకపక్క ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తూనే, విద్యుత్ శాఖ సమీక్షను నిర్వహించిన రేవంత్ రెడ్డి, అధికారిక కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలోనూ రేవంత్ రెడ్డి యాక్టివ్ గా కనిపించడం తెలంగాణ ప్రజలకు ఆసక్తిని కలిగిస్తుంది. భరత్ అనే నేను పాట బిజిఎం తో ఈరోజు ఒక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి తొలిరోజు సచివాలయంలో ఆశీర్వచనాలు, అభినందనల మధ్య ప్రజా పాలన మొదలైంది అన్నారు.

పరిపాలన కేంద్రమైన సచివాలయం ఇక ప్రజాపాలన కేంద్రంగా మారబోతోందని, అభినందనలు తెలిపిన సహచర మంత్రులు అధికార గణానికి ధన్యవాదాలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు మరో ట్వీట్లో రేవంత్ రెడ్డి గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించినట్టు వెల్లడించారు.
తొలి రోజు సచివాలయంలో…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023
ఆశీర్వచనాలు, అభినందనల మధ్య తొలి రోజు ప్రజా పాలన మొదలైంది.
పరిపాలనా కేంద్రమైన సచివాలయం ఇక ప్రజా పాలన కేంద్రంగా మారబోతోంది.
అభినందనలు తెలిపిన సహచర మంత్రులు, అధికార గణానికి ధన్యవాదాలు.#TelanganaPrajaPrabhutwam pic.twitter.com/VvjxchETnC
ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు ప్రజలు తరలివచ్చారు అని బారులు తీరిన ప్రజల వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇంకొక ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి జనం కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజాదర్బార్ సాగిందన్నారు.
జనం నుండి ఎదిగి ఆ జనం గుండె చప్పుడు విని వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించి తృప్తి ఏముంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా తాను చేసిన ప్రతి పనిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాను తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.












Click it and Unblock the Notifications