రూటు మార్చిన రేవంత్ - కేబినెట్ ప్రక్షాళన వేళ బిగ్ ట్విస్ట్.!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో రాజకీయంగా పూర్తి పట్టు సాధించటానికి ప్రస్తుత పరిణామాలు తమకు సహకరిస్తాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. మరో సారి సీఎం రేవంత్.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇదే సమయంలో మంత్రులకు సీఎం రేవంత్ ఇచ్చిన విందు అర్ద్రరాత్రి వరకు కొనసాగింది. అనేక కీలక అంశాలు ఈ విందు సమావేశంలో చర్చకు రాగా.. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులకు భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేసారు.
రేవంత్ దిశా నిర్దేశం
మంత్రివర్గ సహచరులకు సీఎం రేవంత్ విందు ఇచ్చారు. బుధవారం అర్ద్రరాత్రి వరకు ఈ భేటీ కొనసాగింది. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ, కవిత తదితర అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోం ది. కాగా, జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తున్న సమయంలో రేవంత్ ఈ విందు సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొత్త పథకాలు, తీసుకునే నిర్ణయాలతోపాటు ప్రస్తుత పథకాల అమలు విషయంలో ఒకే మాట, అభిప్రాయంపై ఉందామని మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. పలు కారణాలతో మంత్రి సీతక్క హాజరుకాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో.. మంత్రులకు సీఎం విందు ఇవ్వడం ఇదే తొలి సారి.

రాజకీయ చర్చ
కొత్త పథకాల రూపకల్పన, ప్రస్తుత పథకాలు, జూన్ 2న ప్రారంభించబోయే రాజీవ్ యువ వికాసం పథకంపైనా సీఎం, మంత్రులు లోతుగా చర్చించారు. పథకాల అమలు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో అంతా ఒకేతాటిపై ఉంటూ, ఐకమత్యంగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది. మంత్రులు తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని రేవంత్ పేర్కొ న్నట్లు సమాచారం. విందు భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలపైనా మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్‌ఎస్, బీజేపీ వ్యవ రిస్తున్న తీరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ తదనంతర పరిణామాల పైన చర్చించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైనా ఈ సమావేశంలో చర్చ చేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరో సారి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన లో పీసీసీ, మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విందులో మంత్రులతో సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. స్పష్టత వస్తే జూన్ మొదటివారంలో ఎప్పుడైనా.. ప్రకటిస్తారని తెలిపినట్టు సమాచారం. ఇక విందులో పాల్గొన్న మీనాక్షి నటరాజన్ కూడా పీసీసీ, మంత్రివర్గ కూర్పుపై పలు సూచనలు చేసినట్టు తెలిసింది. మంత్రులకు సీఎం ఇచ్చిన విందు రాత్రి 7.30గంటల నుంచి 12గంటల వరకు కొనసాగింది. ఈ విందు సమావేశంలో మంత్రులు సైతం ఓపెన్ గా తమ అభిప్రాయాలను.. పలు విషయాలను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక , మంత్రివర్గ విస్తరణ తరువాత పాలనా పరంగా మరిన్ని కీలక నిర్ణయాలకు రేవంత్ సమాయత్తం అవుతున్నారు.












Click it and Unblock the Notifications