ఓరుగల్లు వేదికగా ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్.. రేపటి షెడ్యూల్ ఇలా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు వేడుకలలో ఆయన వరంగల్ జిల్లా కేంద్రంగా పాల్గొననున్నారు. రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ఈ మేరకు ఖరారు చేశారు. రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండు గంటల 30 నిమిషాలకు కూడా గ్రౌండ్స్ హెలిపాడ్ ప్రాంతానికి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది.
కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అక్కడి నుంచి 2 గంటల 30 నిమిషాల నుంచి మూడు గంటల 10 నిమిషాల వరకు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల 20 నిమిషాల వరకు ఆర్ట్స్ కళాశాలకు రోడ్డు మార్గంలో వెళతారు.

ఇందిర మహిళా శక్తి స్టాల్స్ సందర్శన
3 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వయం సహాయక మహిళా సంఘాల ఇందిర మహిళా శక్తి స్టాల్స్ ను సందర్శించి అక్కడ మహిళలతో మాట్లాడుతారు. ఆపై అక్కడ నుండి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభా వేదిక పైన రాష్ట్ర గీతాలాపనతో పాటు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు.
22 జిల్లాలలో ఇందిర మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
అనంతరం వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి స్వాగత ప్రసంగం చేస్తారు. అనంతరం 4 గంటల నుండి 4 గంటల 20 నిమిషాల వరకు మంత్రులు మాట్లాడతారు. 4 గంటల 20 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు 22 జిల్లాలలో ఇందిర మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు.
రేవంత్ రెడ్డి ప్రసంగం
అనంతరం ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను ప్రారంభిస్తారు. వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం నాలుగు నెలల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతారు. 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications