గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్: కీలక అంశాలపై చర్చ, వినతులు

తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించారు. ఈ సర్వే ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌‌తో భేటీ అయ్యారు.

2025లో దేశ వ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో తెలంగాణ తరహాలో కుల గణనను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్.. గవర్నర్‌ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.

CM Revanth Reddy meets Telangana Governor Jishnudev Varma briefs on caste census

మరోవైపు, మూసీ నది ప్రక్షాళనపై సీఎంని గవర్నర్ ఆరా తీశారు. పేదలు నష్టపోకుండా చూడాలని.. పరిహారం అందించడంలో ఉదారంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించినట్లు సీఎం గవర్నర్‌కు తెలిపారు. మరికొంతమందికి కూడా పరిహారం అందించడంలో ఇబ్బంది లేదని, పేదలకు సాయం అందిస్తామని సీఎం చెప్పారు. రాజ్ భవన్‌లో గవర్నర్, సీఎం పది నిమిషాలపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్‌ని కలసిన వారిలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం: కీలక సూచనలు

ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంపుతో పాటు విద్యా వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి రోజున 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం వారితో ముఖాముఖి మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడం.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం.
చదువుతో పాటు నైపుణ్యత ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్పు.
క్రీడల పట్ల కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.
వ్యసనాలకు బానిసలైతే జీవితాలు నాశనమవుతాయి. మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలి.
ఈనాటి విద్యార్థినీ విద్యార్థులంతా భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+