కేటీఆర్‌ని పొలిటికల్‌గా ఫినిష్ చేస్తా - రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో కాసేపు చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై మండిపడ్డారు. కేసీఆర్ అవుడేట్ మెడిసిన్ అని ఆయన గురించి మాట్లాడటం వ్యర్థం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సంవత్సరం కూడా తిరక్కుండానే కేసీఆర్‌ను ఫామ్ హౌజ్ నాలుగు గోడలకు పరిమితం చేశానని అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని, ఆ పని జరిగి తీరుందని ఆయన తెలిపారు.
నా కారణంగానే కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌజ్‌కు పరిమతమయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో కేటీఆర్‌కు సైతం రాజకీయ ఉనికి లేకుండా చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్‌ని కంట్రోల్ చేయడానికి కొడుకు కేటీఆర్‌ను వాడానని, అదేవిధంగా బావ( హరీష్ రావు)ను వాడుకుని బామ్మర్ది (కేటీఆర్)ని పొలిటికల్‌గా ఫినిష్ చేస్తానని అన్నారు. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో తనకు తెలుసన్నారు. పదేండ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీల నుంచి భారీ స్థాయిలో డబ్బులు దిగమించిన కేసీఆర్ ఫ్యామిలీ ప్రజాధనాన్ని సైతం దుర్వినియోగం చేసిందని, విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు.

ఇప్పటికే ఆ ఫ్యామిలీ అవినీతిపై దర్యాప్తు జరుగుతున్నదని గుర్తుచేశారు. ఇక కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీ గురించి కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు... లక్ష్మీ దేవికి పూజ చేయడం మాత్రమే తెలుసు... కానీ కేటీఆర్ ఫ్యామిలీ, బంధువులు మాత్రం దీపావళి దావత్‌ను సారా బుడ్లతో చేసుకుంటారేమో.... అని వ్యాఖ్యానించారు. దీపావళి దావత్ అలా చేస్తారనే సంగతి తమకు తెలియదన్నారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నిజంగా ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు.
తప్పు చేయడనప్పుడు ముందస్తు బెయిల్ ఎందుకు అడుగుతున్నారని కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటి ఫంక్షన్ అని చెబుతున్నారని, అలాంటి చోట క్యాసినో కాయిన్లు, విదేశీ మద్యం బాటిళ్ళు పరిమితికి మించి ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. మూసీపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని .. ఎవరు అడ్డుకున్న మూసి పునరుజ్జీవం చేసి తీరుతామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications