మీకు వంద రోజులే టైమ్-

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. మేడారం మహా గిరిజన జాతర ప్రారంభం అయ్యే నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. దీనికి సంబంధించిన పలు డిజైన్లను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు.

CM Revanth Reddy orders Medaram Maha Jatara works to be completed in 100 days

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో ఉండాలని, చారిత్రాత్మకంగా, సంప్రదాయాలు ఉట్టి పడేలా వాటిని నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని అన్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ కుమార్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+