సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు - సీఎం రేవంత్ రెడ్డి
గురువారం (మే 15) నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద పవిత్ర సరస్వతి పుష్కర మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు జరుపుకుంటున్నామని, తన హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
నదులు మన నాగరికతకు ప్రతిరూపాలని, నదిని మనం దేవుడిగా భావిస్తామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
మంథని నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ నరసింహారావు గారు ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత దుద్దిళ్ల శ్రీపాదరావు గారు మంథని పేరును నిలబెట్టారని, ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారని ఆయన కొనియాడారు.

బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు శ్రీధర్ బాబు గారు మరింత పనిచేయాలని, అందుకు మంథని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే గోదావరి పుష్కరాలకు అవసరమైతే 200 కోట్ల రూపాయలు కేటాయించి, ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మంథని ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే శ్రీధర్ బాబు లాంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు.

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నపుడు పుష్కరాలు రావడం చాలా సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీలయ్యారు. ఇది సరస్వతి తల్లి అనుగ్రహం అని చెప్పారు. భక్తులకి సరస్వతి దేవి మంచి చేయాలని... రాష్ట్రంలోని పిల్లలకి విద్య ఇవ్వాలని సరస్వతి కటాక్షం పొందేలా సరస్వతి అమ్మవారిని కోరుకున్నామని ఆమె తెలిపారు.12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు తెలంగాణ వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాలు వచ్చేలా మంచి ఏర్పాట్లు చేశామని కొండా సురేఖ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications