వరద సాయంపై కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ రిక్వెస్ట్!!

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది. వరదల కారణంగా అనేక గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన విరుచుకుపడ్డారు. పదేళ్ల పాలనలో లక్ష కోట్లు వెనకేశారని మండిపడ్డారు.

CM Revanth Reddy shocking appeal to KCR and etela rajender over floods relief

2000 కోట్లు అన్నా సీఎం సహాయనిధికి ఇవ్వొచ్చు కదా
రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలమవుతున్న ఈ పరిస్థితుల్లో కూడా కనీసం 2000 కోట్లు అన్నా సీఎం సహాయనిధికి ఇవ్వొచ్చు కదా అంటూ టార్గెట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపైన బీజేపీ నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అమెరికాలో కూర్చుని కేటీఆర్ ట్వీట్లు
బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వద్ద లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అందులో కనీసం రెండువేల కోట్ల రూపాయలైనా విరాళం ఇవ్వాలని హితవు పలికారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం అమెరికాలో పర్యటిస్తున్నారంటూ విమర్శలు గుర్తించారు. అమెరికాలో కూర్చొని ట్విట్టర్లో రాజకీయం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.

ఈటల రాజేందర్ కు సెటైర్
ఇదే సమయంలో బిజెపి నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక కుటుంబానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి పైన రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల పరిహారాన్ని కేంద్రం నుండి మీరే ఇప్పించాలని ఆయన ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+