షాకింగ్: జర్నలిస్టులను ఏంటి సీఎం రేవంత్ అన్ని మాటలన్నాడు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా జర్నలిస్టులపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఓ దినపత్రిక పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మారుతున్న జర్నలిజం పోకడల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జర్నలిస్టులకు అన్ని రంగాల పైన పట్టు ఉండేదని, ప్రస్తుత మీడియాలో వింత పోకడలు వచ్చాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జర్నలిస్ట్ అన్న పదానికి అర్ధం లేకుండా పోతుంది: సీఎం రేవంత్
గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు పత్రికలను నడిపేవారని, కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడలతో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ పత్రికలు కొన్ని పని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth reddy shocking comments on journalists

Take a Poll

జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడలు
ప్రస్తుతం జర్నలిజంలో వచ్చిన వింత పోకడలకు తోడు వాటికి రాజకీయ పార్టీలు కూడా తోడు అయ్యాయని, చివరకు వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో ఉన్న కొందరు కొన్ని రాజకీయ పార్టీల పత్రికల కోసం పని చేస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనించాలని ఆయన అన్నారు. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ అనే పదానికి అర్థం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

ఈరోజుల్లో ఎవరు పడితే వాడే జర్నలిస్టు
గతంలో ప్రెస్మీట్ లు నిర్వహించినప్పుడు తాము చాలా జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళమని, సదరు సబ్జెక్టుపై జర్నలిస్టుల నుంచి వివరాలు తీసుకునే వాళ్ళమని గుర్తు చేశారు. ఈరోజు అటువంటి వ్యవస్థ లేదన్నారు. ఈరోజుల్లో ఎవరు పడితే వాడే జర్నలిస్టు అని చెప్పుకుంటున్నాడు అని మండిపడిన రేవంత్ రెడ్డి, అఆ, ఇ ఈ లు రానోడు కూడా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఇంటి పేరు లెక్క తోక తగిలించుకుంటున్నారు అని మండిపడ్డారు.

ఫేక్ జర్నలిస్టులకు వేరు చెయ్యాలి
అలాంటి ఫేక్ జర్నలిస్టులను వేరు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని నిజమైన జర్నలిస్టులు అందరూ గుర్తించి ఫేక్ జర్నలిస్టులకు చెక్ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి . ఇక స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలను ఏ కవి తాటి పైకి తీసుకురావడానికి నడు పత్రికలు ఉపయోగపడ్డాయని, కానీ ప్రస్తుతం ఆయా మీడియా సంస్థలు తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయి అని, అటువంటి పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+