కవితను బయటికి పంపడానికి అసలు కారణం అదే - సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయితీ నడుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. కవితను బయటకు నెట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌లేనని ఆరోపించారు. కుటుంబ అంతర్గత విషయాలకు తానెప్పుడూ సంబంధం పెట్టుకోనని స్పష్టం చేశారు. దీంతో ఈ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి.

అలానే కవిత వ్యవహారం కుటుంబ ఆస్తి వివాదం తప్ప మరేమీ కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారని, కుటుంబ అంతర్గత విషయాలకు ప్రజలకు సంబంధం లేదని అన్నారు. ప్రజలు ఇప్పటికే కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ అనేకమంది అమాయక యువకులను బలి చేశారని.. అదే ఉసురు ఇప్పుడు ఆయనకు తాకిందని విమర్శించారు.

cm-revanth-reddy-shocking-comments-on-kcr-family-and-kavitha

సదరు విషయాల ఫలితంగానే కుమార్తె కవిత దూరమైందని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా కేసీఆర్ అండ్ కో అడ్డుకోవడం చిన్న విషయం కాదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉందని.. అది కాకపోతే సీబీఐకి ఇచ్చే వాళ్లమని రేవంత్ చెప్పారు. కేసీఆర్ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

బీఆర్ఎస్-బీజేపీ విలీనం..

బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపాలని కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారని రేవంత్ ఆరోపించారు. నలుగురు కలిసి ఒక మహిళపై దాడి చేస్తున్నారని, ఈ విషయంపై మహిళా సంఘాలు స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను తాము అరికట్టామని, కానీ పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన ఘటనను గుర్తుచేశారు. దుబాయ్‌లో చనిపోయిన డైరెక్టర్ కేదర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా తమ ప్రభుత్వానికి అందిందని వెల్లడించారు.

షాడో సీఎం ఆరోపణలపై ఫైర్ ..

షాడో సీఎం ఎవరో పేరు పెట్టి చెప్పాలని రేవంత్ సవాలు చేశారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఎదుర్కొన్నానని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వంత తెలివి లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కిషన్‌రెడ్డిని అద్దెకు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసు సీబీఐలోకి వెళ్లి చాలా రోజులు అయినా విచారణ జరగకపోవడానికి కేటీఆర్-కిషన్‌రెడ్డి మధ్య ఉన్న అవినాభావ సంబంధమే కారణమని ఆరోపించారు.

బీఆర్ఎస్‌కే స్పష్టత లేదు..

పార్టీ మార్పుల విషయంలో బీఆర్ఎస్‌కే స్పష్టత లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో హరీశ్‌రావు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పగా, కేటీఆర్ వేరే సంఖ్య చెబుతున్నారని అన్నారు. ఇంటికొచ్చిన వారిని కండువా వేసుకుంటే పార్టీ మారినట్లేనా అని ప్రశ్నించారు. అలానే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని అన్నారు.

ఎందుకు కొట్టించారు..?

తాను ఏపీ సీఎం చంద్రబాబును సీఎంగా కలిశానని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని రేవంత్ చెప్పారు. తన మాటలతో లోకేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని.. లోకేశ్‌ను రహస్యంగా కలవడానికి కారణం కేటీఆర్ చెప్పాలన్నారు. తమ్ముడిలాంటి వాడని చెబితే కష్టకాలంలో అన్నలా ఎందుకు ప్రవర్తించలేదు? చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆ జనాన్ని కేటీఆర్ ఎందుకు కొట్టించారు? అని రేవంత్ నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+