డెవలప్‌మెంట్‌ బ్లూ ప్రింట్‌, పేర్ల మార్పుపై కీలక నిర్ణయం

అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. జల్-జంగల్-జమీన్ పోరాటాలకు ప్రతీక అయిన ఆదిలాబాద్‌కు తగిన న్యాయం జరగలేదని స్పష్టంగా పేర్కొన్న సీఎం, జిల్లాను అభివృద్ధి పథంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పిన సీఎం, పాలమూరు జిల్లాకు ఇచ్చినట్టే ఆదిలాబాద్‌కు కూడా సమాన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లా అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్న రేవంత్‌, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం చర్యలు ప్రారంభించామని తెలిపారు.

CM Revanth Reddy Unveils Massive Development Blueprint for Adilabad at Nirmal Public Meeting

తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ కీలకం

ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు అందాలంటే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరిగా జరగాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. "ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం" అంటూ రైతులకు భరోసా ఇచ్చారు.

యూనివర్సిటీ, ఎయిర్‌పోర్టు, ఇండస్ట్రియల్ హబ్

ఆదిలాబాద్‌కు మంజూరైన యూనివర్సిటీ రాజకీయ కారణాలతో జాప్యం అయిందని విమర్శించిన సీఎం, బాసర IIT క్యాంపస్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు సూచించారు. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అభివృద్ధిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డికి ఆదేశించారు.

ఎర్రబస్సు కూడా తిరగని ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్‌ తిరిగే రోజులు రావాలి అంటూ విమానాశ్రయం ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, 10 వేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

సంక్షేమం - అభివృద్ధి రెండూ సమానం

ఎన్నికల సమయంలో రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి అనే స్పష్టమైన వైఖరిని సీఎం వెల్లడించారు. అభివృద్ధిలో రాజకీయాలకు చోటు లేదని, ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ అజెండా అని చెప్పారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, సన్నాలకు బోనస్‌, రూ.500 గ్యాస్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

కేంద్రంతో పోరాటం - రాష్ట్ర ప్రయోజనం కోసం

గత పాలకులు చేసిన అప్పులు ప్రజల ఊపిరి తీసే పరిస్థితికి తీసుకువచ్చాయని విమర్శించిన సీఎం, రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తానని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.

పేర్ల మార్పుపై కీలక నిర్ణయం

చనాక-కొరటా ప్రాజెక్టుకు సీ. రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు సీఎం ప్రకటించారు. ప్రజలకు సేవ చేసిన నేతల పేర్లు ప్రాజెక్టులకు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

"నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తా... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించండి" అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+