అది.. బ్రిటీషోళ్ల జనతా పార్టీ- అందుకే పీఎంగా..: రేవంత్ రెడ్డి ఫైర్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టులకు నిరసనగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో ఈ ఉదయం జరిగిన భారీ ఆందోళన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. నీట్ పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును మోదీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం వల్లే ఈ అక్రమాలు జరిగాయని, ఆయనను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రధాని మోదీ ఆయనను తొలగించకపోతే స్వయంగా తానే రాజీనామా చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

CM Revanth Reddy Urged to Centre to Dismiss Dharmendra Pradhan or Resign Playing Children s Lives

ప్రజాస్వామ్యయుతంగా తమ గొంతుకను వినిపిస్తున్న విద్యార్థులు, నిరసనకారులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. వైబ్రెంట్ డెమోక్రసీగా చెప్పుకునే భారత్ లో ఇలాంటి బలప్రయోగాలు చేయడం ఆందోళనకరమని, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించిందని, ఆ హక్కును గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీని బ్రిటీష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారితో పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని, పేదలు, యువత హక్కుల కోసం గత వందేళ్లుగా కాంగ్రెస్ రాజీలేని పోరాటాలు సాగిస్తోందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పోరాటం కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికల పోరు మాత్రమే కాదని.. దేశాన్ని రక్షించుకునేందుకు గాంధీ, గాడ్సే వారసులకు మధ్య జరుగుతున్న ఒక చారిత్రక యుద్ధమని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ జోడీ కలిసి ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారి కుట్రలను కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వబోదని తేల్చి చెప్పారాయన. భవిష్యత్తులో దేశ యువత అంతా ఏకమై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉందని, రానున్న రోజుల్లో మోదీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు.

తమ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల దిశానిర్దేశంలో వీధుల నుంచి ఢిల్లీ పార్లమెంtop వరకు ఈ సుదీర్ఘ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్యాయం జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం నిరంతరం గొంతు వినిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+