సీఎం రేవంత్ వచ్చినా కొండా సురేఖకు పట్టింపు లేదా!

నేడు హనుమకొండలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించిన కారణంగా పిజిఆర్ గార్డెన్ లో నిర్వహించిన స్మారక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నాయకులు అందరూ హాజరు కాగా, కొండా సురేఖ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

కొండా సురేఖ వ్యవహార శైలిపై చర్చ
ఇప్పటికే తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. నిన్న కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డి సుమంత్ ను పదవి నుండి తొలగించిన ప్రభుత్వం ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. కొండా సురేఖ అటవీ శాఖలో డిప్యుటేషన్, బదిలీలు అన్ని సుమంత్ చెప్పినట్టే జరిగేవని తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రేవంత్ హన్మకొండలో పర్యటిస్తున్నా రాని కొండా సురేఖ
ఇక రేవంత్ సర్కార్ ఇచ్చిన షాక్ కు కొండ సురేఖ ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ లో పర్యటిస్తున్నా రాలేదని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కొండా సురేఖకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తుంది.

CM Revanth reddy visit to hanamkonda Konda Surekha stay away Is this the reason

దొంతి మాధవ రెడ్డి తల్లికి నివాళులు అర్పించిన సీఎం
కాగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యం లో హన్మకొండ లోని పి జీ ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమం లో పాల్గొని ఆమె చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అంతకుముందు హన్మకొండ లోగల ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానం లోగల హెలిప్యాడ్ వద్ద కు చేరుకున్న ముఖ్యమంత్రి కి నగర మేయర్ గుండు సుధారాణి స్వాగతం పలికారు.

రేవంత్ రెడ్డి రాకను స్వాగతించిన స్థానిక నాయకులు
ఈ సందర్భం గా హెలిప్యాడ్ వద్ద బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ముఖ్యమంత్రికి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ(సీతక్క) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సి ఏం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, లోక్ సభ సభ్యులు డా. కడియం కావ్య, బలరాం నాయక్ లు పాల్గొన్నారు.

కొండా సురేఖ రేవంత్ కార్యక్రమానికి దూరం
అంతేకాదు ప్రభుత్వ విప్ రామా చంద్రూ నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే కొండా సురేఖ ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ కార్యక్రమానికి హాజరు కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+