CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దర్శించుకున్నారు. ఆలయానికి రేవంత్ రెడ్డికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు రాత్రి లేదా సోమవారం ఉదయం రాహుల్ గాంధీతో సమావేశం కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అప్పుడే రూ.2 లక్షల రుణ మాఫీ హామీ ఇచ్చారు. తాజాగా ఇచ్చిన హామీని కాంగ్రెస్ అమలు చేస్తోంది. రైతులకు రూ.లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ చేసింది. ఆగస్ట్ 15 కల్లా రూ.2 లక్షల రుణ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.

రైతులకు రుణ మాఫీ చేసిన సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ తీసుకొచ్చి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రాహుల్ గాంధీ ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్తున్నారు. పనిలో పనిగా మంత్రి వర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. అలాగే పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కూడా చర్చించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications