బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇక రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రొమోట్ చేసిన వారిలో టాలీవుడ్ ప్రముఖ హీరోల నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఉండటం సంచలనంగా మారింది. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మీతో సహా మొత్తం 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ కేసులో ఉన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు బుల్లితెర నటులైన హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని ఇలా 11మందిపైనా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

అంతేకాక ఈ జాబితాలో బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫన్ 88 బెట్టింగ్ యాప్ ను బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ను నిషేధించింది. అయినా ఇలా సెలబ్రిటీలు సైతం యాప్స్ ను ప్రొమోట్ చేయడంపై రేవంత్ సర్కార్ మండిపడుతోంది. ఈ యాప్స్ వల్ల మోసపోయి ఇప్పటివరకు దాదాపు 980 మంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications