నేను చూస్తూ ఊరుకోను- సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక..!!
ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖలకు చురకలు అంటించారు. మహిళ మరణానికి కారణమైన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే ఎందుకు అంతగా పరామర్శిస్తున్నారని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించలేదని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట గురించి చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూసిన తరువాతనే వెళ్తానని చెప్పారని రేవంత్ వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాకం ఇస్తామని.. కానీ, స్పెషల్ ప్రివిలేజ్ తాను సీట్లు ఉండగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
రేవంత్ వ్యాఖ్యలతో
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో ఇక ఏ సినిమాకు ప్రీమియర్ షో కు అవకాశం ఉండదని స్పష్టం చేసారు. సినిమా థియేటర్ లో తొక్కిసలాట గురించి చెప్పి .. సినిమా చూస్తున్నఅల్లు అర్జున్ ను వెళ్లాలని చెప్పినా.. సినిమా అయ్యే వరకు వెళ్లనని అల్లు అర్జున్ చెప్పారని సభలో రేవంత్ వివరించారు. ఆ తరువాత చర్యలు తీసుకోవాల్సి వస్తుందని.. పరిస్థితి కంట్రోల్ తప్పుతుందని చెప్పిన తరువాత అల్లు అర్జున్ బయటకు వచ్చి.. ఆ తరువాత కూడా కారు టాప్ నుంచి చేతులు ఊపుతూ వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆ తొక్కిసలాట లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం తో పాటుగా బాలుడు ప్రాణాపాయం లో ఉన్నారని చెప్పారు.

అల్లు అర్జున్ వినిపించుకోలేదు
సినీ పరిశ్రమ గురించి రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించడానికి ముందుకు రాలేదన్నారు. దీనిని బట్టి చూస్తుంటే అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారనేది తనకు అర్థం కావడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. అసలు అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూ కట్టి నన్ను తిడుతున్నారు. అల్లు అర్జున్‌కు ఏమైనా కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా.. ఎందుకు అంతగా పరామర్శిస్తున్నారని ప్రశ్నించారు. సినిమా వాళ్లపై నాకు కోపం ఎందుకు ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. సినిమా వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనుమతులు ఉండవు
అల్లు అర్జున్ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని నిలదీసారు. తాను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇవ్వనని తేల్చి చెప్పారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవాలని... ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం చూస్తూ ఊరుకోంమని సీఎం రేవంత్ మండిపడ్డారు. చట్టం అందరికీ ఒక్కటే..సినిమా పెద్దలు మానవత్వం మర్చిపోవద్ద ని రేవంత్ పేర్కొన్నారు. సినిమా వాళ్లకు ప్రత్యేక ప్రివిలేజ్ సాధ్యం కాదన్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ప్రాణాలు పోతుంటే ఎలా అని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు ఏమని ఆలోచన చేస్తున్నారో అర్దం కావటం లేదన్నారు. అర్ద్రరాత్రి జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేసారని.. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ప్రాసెస్ ప్రకారం విడుదల చేస్తారని రేవంత్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications