ఈ జిల్లాలకు హై అలర్ట్, వరద ప్రాంతాలకు సీఎం రేవంత్..!!
మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వరద నీరు వరంగల్, హన్మకొండ ను ముంచెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ తుఫాను.. వరదల పైన ఉన్నత స్థాయి సమీక్ష చేసారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని సీఎం నిర్ణయించారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేయాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో బాధితులకు సాయం పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
తుఫాను.. వరదలపైన సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన సమీక్ష లో క్షేత్ర స్థాయి పరిస్థితిని ఆరా తీసారు. తుపాను ప్రభావిత జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందు బాటులో ఉండాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని సీఎం స్పష్టం చేసారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్‌హాల్స్‌కు తరలించాలని ఆదేశించారు. పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోలుపై రిపోర్ట్ ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ స్ఫష్టం చేశారు. వరదలకు దెబ్బతిన్నరోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తుండాలని, చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా ఉండాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్‌లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించు కోవాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెల పాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications