జూబ్లీహిల్స్ లో టెన్షన్ పెంచుతున్న సర్వేలు - రేవంత్ అనూహ్య నిర్ణయం..!!

జూబ్లీహిల్స్ లో లెక్కలు మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ తో చర్చలు చేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సర్వే నివేదికల ఆధారంగా వ్యూహాలను మార్పు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రేవంత్ అమలు చేస్తున్న కొత్త వ్యూహం ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.

జూబ్లీహిల్స్ లో గెలుపు ముఖ్యమంత్రి రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ అటు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటిక సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ లో మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్ప గించారు. ప్రతీ రోజు ప్రచారం... మారుతున్న సమీకరణాల పైన ఆరా తీస్తున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలోనూ జూబ్లీహిల్స్ లో గెలుపు పైన చర్చ జరిగి నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితం రానున్న గ్రేటర్ ఎన్నికల పైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక్కడ గెలుపు కోసం తాను ప్రచార బరిలోకి దిగాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

CM Revanth to attend road shows in Jubilee hills election campaign details here

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని యూస్‌ఫగూడ పోలీ్‌సగ్రౌండ్స్‌లో ఈ నెల 28న తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ జరగనుంది. ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావునూ సన్మానించనున్నారు. ఆ సభలో.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నట్లు సమాచారం.

CM Revanth to attend road shows in Jubilee hills election campaign details here

అలాగే ఈ నెల 30, 31 తేదీల్లోను మళ్లీ నవంబర్‌ 4, 5 తేదీల్లోనూ ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటికి మధ్యలో బిహార్‌ ఎన్నికల ప్రచారానికీ ఆయన వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రచారంలో కాంగ్రెస్ 18 నెలల పాలనను ప్రస్తావిస్తోంది. సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. దీంతో.. రేవంత్ తాను జూబ్లీహిల్స్ బాధ్యతలను తీసుకుంటున్న వేళ.. ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+