ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు కట్ : సీఎం రేవంత్..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చేసిన తప్పులను ప్రశ్నిస్తు న్నందు కే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకుని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు.ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కొడంగల్ లో పర్యటిస్తున్న రేవంత్ ఢిల్లీ పరిణామాల పైనా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అరెస్టు చేసి, పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవిక దాడి జరిపారని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరు కావొచ్చు కానీ, వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని చెప్పారు.

రేవంత్ కీలక సూచనలు
కాంగ్రెస్ కు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో 78 శాతం మంది సర్ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని అధికారులకు సూచించారు.
ఓటర్ల తో బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్ తప్పకుండా నమోదు చేయించాలన్న సీఎం, ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతోందని, కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదని రేవంత్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications