హోంగార్డులకు సీఎం రేవంత్ వరాలు: ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్
బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా వారికి నివాళి అర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎస్‌డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంబేడ్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించామన్నారు. ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి.. కానీ, ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయని సీఎం రేవంత్ అన్నారు.

డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు
పోలీస్ శాఖలో దాదాపు 15 వేల నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ తెలిపారు. పీజీలు, పీహెచ్‌డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్‌ను నిరోధించాల్సిన అవసరం ఉంది.డ్రగ్స్ సరఫరా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు సీఎం రేవంత్.
బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్‌లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారని రేవంత ప్రశంసించారు.
తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్, గంజాయి లాంటివి కనిపించొద్దు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి. డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలి. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లు
ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అని చెప్పారు సీఎం రేవంత్. ట్రాన్స్ జెండర్స్‌పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు. అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది అని సీఎం రేవంత్ చెప్పారు. ట్రాన్స్ జెండర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తామన్నారు.
హోంగార్డులపై రేవంత్ వరాలు
ఐపీఎస్ అధికారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2 కోట్లు అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం.. హోమ్ గార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ weekly parade allowanceను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం.
హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజ మరణం పొందినా, accidental మరణం చెందినా Rs 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్.
జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.
శాంతిభద్రతలను కాపడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అయినా పరిష్కారం కాకపోతే ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి. ఆపై ఇంకేమైనా సమస్యలుంటే నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications