జపాన్ చేరుకున్న సీఎం రేవంత్.. ఎంబసీలో విందు

వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. బుధవారం టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో భారత రాయబారి శిబు జార్జ్‌తో సీఎం బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందానికి ఎంబసీలో విందు భోజనం ఏర్పాటు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి నెపోలియన్, పలువురు అధికారులు ఈ విందులో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 22 వరకు జపాన్ పర్యటనలో ఉండనున్నారు. టోక్యో, ఒసాకా, హిరోషిమా, మౌంట్ ఫుజి ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జపాన్‌లోని ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై చర్చలు జరపనున్నారు.

CM Revanth s team arrives in Japan dinner at Indian Embassy

ఏప్రిల్ 17న ఉదయం సోనీ గ్రూప్, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌తో సమావేశమవుతారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. ఏప్రిల్ 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత టోక్యో వవర్నర్‌తో భేటీ అవుతారు. టయోటా, ఐసిన్, ఎన్టీట సీఈవోలతో చర్చలు జరుపుతారు. అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు.

ఏ్రప్రిల్ 19న మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్‌లను సందర్శించి, ఓసాకాకా బయల్దేరుతారు. ఏప్రిల్ 20న కిటాక్యుు మేయర్‌తో సమావేశమవుతారు. ఎకో టౌన్ ప్రాజెక్టుపై చర్చలు జరుపుతారు. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజియంను సందర్శిస్తారు. ఏప్రిల్ 21న ఓసాకా వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓసాకా రివర ఫ్రంట్ ను సందర్శిస్తారు. ఏప్రిల్ 22న వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్‌తో భేటీ అవుతారు.

కాగా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి గురువారం జపాన్ చేరుకుంతారు. జపాన్ పర్యటన అనంతరం కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ఏప్రిల్ 23న ఉదయం సీఎ బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+