హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊడిన ఉద్యోగాలు, హైదరాబాద్‌లో రోడ్డున పడ్డ టెక్కీలు, ఆర్నెల్ల జీతాలతో ఇంటికి

మాదాపూర్ ఐటి కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన నాలుగు వేలమంది ఐటి నిపుణులు, ఉద్యోగులు తొలిసారిగా కార్మిక సంక్షేమ భవన్ గడప తొక్కారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాదాపూర్ ఐటి కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన నాలుగు వేలమంది ఐటి నిపుణులు, ఉద్యోగులు తొలిసారిగా కార్మిక సంక్షేమ భవన్ గడప తొక్కారు.

కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు వేటు వేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టీటా)ని ఆశ్రయించారు.

గురువారం టీటా ప్రతినిధులు, కార్మిక శాఖ సంక్షేమ భవన్‌లో జాయింట్ కమిషనర్ చంద్రశేఖరన్, కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కాగ్నిజెంట్ ప్రతినిధులు తమకు 26వ తేదీ వరకు గడువు కావాలని, యాజమాన్యాన్ని సంప్రదించి తెలియచేస్తామన్నారు.

 ఆరు నెలల వేతనం చెల్లించండి

ఆరు నెలల వేతనం చెల్లించండి

ఈ చర్చల్లో టీటా అనేక డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 6 నెలల వేతనం చెల్లించాలని, కార్మిక శాఖ చట్టాలకు లోబడి వ్యవహరించాలని టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల కార్మిక శాఖ, కాగ్నిజెంట్ ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు.

కంపెనీ ఇలా చేయాలి

కంపెనీ ఇలా చేయాలి


ఉద్యోగం పోయిన వెంటనే బీమా సదుపాయం ఆగిపోతుందని, దీంతో ఉద్యోగిపై ఆధారపడిన ఫ్యామిలీ తీవ్రమైన ఇక్కట్లకు లోనవుతారన్నారు. ఏడాదిపాటు బీమా సదుపాయం కొనసాగించాలన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి ఏడాదిపాటు అదే కంపెనీలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు శిక్షణ ఇచ్చే సదుపాయం కల్పించాలన్నారు.

ప్రభుత్వం ముందుకు రావాలి

ప్రభుత్వం ముందుకు రావాలి

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉద్యోగులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వెబ్‌సైట్లు హాకింగ్‌కు గురవుతున్నాయని, సైబర్ నిపుణులుగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని నియమించాలన్నారు. వివిధ శాఖల్లో ఐటి సంబంధిత సేవల్లో ఐటి వర్కర్లను నియమించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీటా ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాదులో అలజడి

హైదరాబాదులో అలజడి

మాదాపూర్‌లోగత ముప్పై రోజుల్లో దాదాపు నాలుగు వేలమంది ఐటి ఉద్యోగులను ఉద్యోగాల నుంచి వివిధ కంపెనీలు తొలగించడంతో ఐటి రంగంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కొత్తగా చేరిన వారు ఉద్యోగాలు పోతాయనే భయం పెట్టుకోవాల్సిన పని లేదని, సీనియర్లపై మాత్రమే ప్రభావం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పెద్ద జీతాల వారే టార్గెట్

పెద్ద జీతాల వారే టార్గెట్

ఐటీ కంపెనీల్లో గరిష్టంగా పదేళ్లు పని చేయాలని ఆ తర్వాత పెద్ద జీతాల వారిని లక్ష్యంగా చేసుకుని ఐటి కంపెనీలు మిడిల్ లెవల్ ఐటి నిపుణులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులను తొలగించేందుకు రేటింగ్‌లను తగ్గించడం మంచి పద్ధతి కాదని అంటున్నారు.

వారిని తొలగించలేదని..

వారిని తొలగించలేదని..

చంద్రశేఖరన్‌ను కలిసిన వారిలో కాగ్నిజెంట్‌ నుంచి తొలగించబడిన ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా దీనిపై చర్చించేందుకు సంస్థ యాజమాన్యం తరఫున అయిదుగురు ప్రతినిధులు హాజరైనట్లు చంద్రశేఖరం తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన ఎనిమిది మంది ఉద్యోగుల్లో ముగ్గురు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని, మిగతా అయిదుగురు ఇప్పటికీ తమ ఉద్యోగులేనని, వారిని తొలగించలేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారని అన్నారు.

English summary
IT firm Cognizant today sought two weeks' time from the Telangana Labour Department to come up with a reply on the issue of "resignations" by some of the employees of the company, a senior official of the department said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X