Weather: తెలంగాణలో వణికిపోతున్న ప్రజలు..
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు మంచు ఉంటుంది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి గాలులు వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
బుధవారం పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో గడిచిన 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో కనిష్ఠంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. కుమురం భీం జిల్లా సిర్పూర్ (యూ)లో 10.4, నిర్మల్ జిల్లా పెంబిలో 11 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమినిలో 14.8గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా పేర్కొంది.

రానున్న రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్‌లో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు గ్రేటర్ పరిధిలోనూ చలి తీవ్రత పెరిగింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠంగా 28.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ఠంగా 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.
హైదరాబాద్ లో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మ్మడి ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటే వరకు చలి పంజా విసురుతోంది. రాత్రి 8 గంటల తర్వాత పట్టణాల్లోని షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలలో ఒక్కసారిగా రద్దీ తగ్గుతోంది.












Click it and Unblock the Notifications