రాజేందర్‌రెడ్డి Vsశివకుమార్‌రెడ్డి: టిఆర్ఎస్ నేతల మధ్య అధిపత్యపోరు

Posted By:
Subscribe to Oneindia Telugu

నారాయణపేట: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతల మధ్య సమన్వయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పెత్తనాన్ని పార్టీ ఇంచార్జీ శివకుమార్‌రెడ్డి వర్గీయులు సహించడం లేదు.

2014 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా రాజేందర్‌రెడ్డి పోటీచేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా శివకుమార్‌రెడ్డి బరిలోకి దిగారు.

Cold war between Narayanapet MLA Rajender reddy Trs incharge Shivakumar Reddy

అయితే టిఆర్ఎస్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డిపై టిడిపి అభ్యర్థి రాజేందర్‌రెడ్డి విజయం సాధించారు.అయితే ఆ తర్వాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజేందర్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

రాజేందర్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్ చేరిననాటి నుండి టిఆర్ఎస్ నేత శివకుమార్‌రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటివరకు పార్టీని కాపాడుకొంటూ వచ్చిన తమపై కొత్తగా పార్టీలో చేరిన రాజేందర్‌రెడ్డి పెత్తనం కొనసాగించడంపై శివకుమార్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి నుండి పార్టీని నమ్ముకొన్నవారిని కాదని ఎమ్మెల్యే తన వెంట పార్టీ మారిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని శివకుమార్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.ఇటీవల నారాయణపేటలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన సందర్భంగా శివకుమార్‌రెడ్డి ఈ విషయమై మంత్రితోనే నేరుగా గొడవకు దిగారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a cold war between Narayanpet MLA Rajender Reddy and TRS incharge Shivakumar reddy. Trs incharge Shivakumar Reddy followers dissatisfied on Narayanpet Mla Rajender Reddy attitude.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి