అది సూసైడ్ బాంబు కంటే ప్రమాదకరం: హైదరాబాద్ సీపీ (ఫోటోలు)

హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగర ప్రజలను ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ట్రాఫిక్, షీటీమ్స్ సెంట్రల్‌జోన్ ఔట్ పోస్టు స్టాళ్లను బుధవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం హైదరాబాద్ ట్రాఫిక్, షీటీమ్స్ స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం సీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2016 సంవత్సరం ఇయర్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సిటీ పోలీస్‌గా ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా అతి ముఖ్యమైన ట్రాఫిక్ అంశంను సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది కాలంలో ట్రాఫిక్ పరంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

మద్యం సేవించి వాహనం నడపడం, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అంటే సూసైడ్ బాంబుల కంటే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న విధుల్ని ఆయన అభినందిస్తూ ప్రజల్లో, వాహనదారుల్లో చైతన్యం రావాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన స్టాళ్లతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతంలో కంటే తొందరగా ఎగ్జిబిషన్‌లో స్టాల్ ఏర్పాటు చేశారన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

అడిషనల్ సీపీ క్రైమ్స్ స్వాతిలక్రా మాట్లాడుతూ ఏడాది కాలంగా సీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో 99.9 శాతం మహిళలకు భద్రత కల్పిస్తున్నామన్నారు.

 సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

 సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్

కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అనిల్ మిశ్రా, కార్యదర్శి సత్యేందర్, ట్రాఫిక్ డీసీపీ-2 ఏవీ రంగనాథ్, సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ రామ్మోహన్‌రావు, ట్రాఫిక్ అదనపు డీసీపీ సుంకర సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ వై. నాగిరెడ్డి, ఏసీపీలు రాఘవేందర్‌రెడ్డి, జైపాల్, ప్రేమ్‌కాజల్, కవిత, ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్, ఎస్‌ఐ సీనయ్యతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+