ఆందోళన: సత్యవాణి ఫ్యామిలీకి పరిహారం
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్‌లో బుధవారం రాత్రి నాలాలో పడి మరణించిన సత్యవాణి కుటుంబానికి పరిహారం చెల్లించడానికి అధికారులు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సికింద్రాబాద్ ఆర్డీవో రఘురాం ప్రసాద్ గాంధీ ఆస్పత్రి వద్దకు వచ్చారు.
సత్యవాణి కుటుంబ సభ్యులతో ఆయన చర్చలు జరిపి తక్షణం వారికి లక్షన్నర రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి అర్హనతను బట్టి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

పోస్టుమార్టం తర్వాత సత్యవాణి మృతదేహాన్ని గుంటూరు జిల్లాలోని ఆమె స్వగ్రామాం ఈపూరుకు తరలించారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు.
బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది.












Click it and Unblock the Notifications