దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు: నీచ భాష అంటూ కేటీఆర్ ఫైర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారదను కలిసి తెలిపారు. దానంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
మరోవైపు, దానం వ్యాఖ్యలపై బీజేపీ నేతలతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మండిపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పట్ల దానం నాగేందర్ ఉపయోగించిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదన్నారు కేటీఆర్. కంగనా రనౌత్ అభిప్రాయాలను, ఆమె పార్టీ ఐడియాలజీని తాను ఏకీభవించను.. కానీ ఇలా ఆమెపై దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

ఢిల్లీలో, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా దానం నాగేందర్ వ్యాఖ్యల పట్ల మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది. దానం వ్యాఖ్యలను వారు ఆమోదిస్తున్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. తెలంగాణలోని మీ సొంత పార్టీ సభ్యులు, రేవంత్ రెడ్డి స్పందించకముందే.. కేసీఆర్ స్పందించారు.
సోనియా గాంధీని అవమానించేలా హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ఖండించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాజకీయాలను పక్కనపెడితే నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్. క్రూరమైన నేరం.. క్రూరమైన నేరమే. అది రేప్ కావొచ్చు. మర్డర్ కావొచ్చు.. మహిళలను కించపరిచేలా మాట్లాడటం కూడా నేరమే. మీ పార్టీలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని, పార్టీ కేడర్‌కు విలువలు నేర్పాలని సూచిస్తున్నాను. స్త్రీలను గౌరవించడం అనేది మర్యాదకు సంబంధించిన అంశం అని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications