వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరో గ‌ట్టున మాధ‌వుడు, ముర‌ళీ లోలుడు.!మ‌ద్య‌లో ప‌రిపూర్ణుడు.!క‌మ‌లం లో పొస‌గ‌ని క‌ల‌యిక‌లు..!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: కమలదళంలో విభేదాలు నివురు గ‌ప్పిన నిప్పులా త‌యార‌య్యాయి. మ‌న‌స్ప‌ర్థ‌లు ఎప్పుడు అగ్నిగుండంగా మారతాయో తెలియ‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు అధిష్టానానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇటీవలి పరిణామాలతో ఈ పోరు మరింత ప‌రాకాష్ట‌కు చేరింద‌ని పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ మధ్యే పార్టీలో చేరిన పరిపూర్ణానంద స్వామి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో చిచ్చు పెడుతున్నారని ఓ వర్గం ఘాటుగా ఆరోపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి దొరికింది ఓ రేవ‌తి..! తెలుగుదేశం పార్టీకి దొరికింది ఓ రేవ‌తి..!

ప‌రిపూర్ణానంద ఆంద్రావాలా..! తెలంగాణ‌లో ఎలా పోటీ చేయిస్తారంటున్న స్థానికులు..!

ప‌రిపూర్ణానంద ఆంద్రావాలా..! తెలంగాణ‌లో ఎలా పోటీ చేయిస్తారంటున్న స్థానికులు..!

పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు రాంమాథవ్ నేత్రుత్వంలో పరిపూర్ణానంద స్వామిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో స్వామి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఎదుగుదలకు, అక్కడి కార్యక్రమాలకు పరిమితం చేస్తారని తెలంగాణ నాయకులు భావించారు. అయితే అందుకు విరుద్ధంగా పరిపూర్ణనందను నగరంలోని ఏదైనా నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపాలని అధిష్టానం భావించడం, అదే విషయం ఇక్కడి నాయకులకు సూచాయ‌గా తెలియజేయడంతో వారంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

న‌చ్చ‌ని రాంమాధ‌వ్ వ్య‌వ‌హారం..! ఆగ్ర‌హంలో బీజేపి శ్రేణులు..!

న‌చ్చ‌ని రాంమాధ‌వ్ వ్య‌వ‌హారం..! ఆగ్ర‌హంలో బీజేపి శ్రేణులు..!

దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధానాలు రాకపోయినా, ఇక్కడ తామే కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తామని అధిష్టానం చెబుతోంది. ఈ దశలో పరిపూర్ణనంద స్వామిని తెలంగాణకు పరిమితం చేయడం పట్ల ఇక్కడి నాయకుల్లో వ్యతిరేకత వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ నాయకులైతే తమను అధిష్టానం పట్టించుకోవడం లేదని, ఇక్కడ పార్టీ ఏమైపోయినా పరవాలేదనే రీతిలో వ్యవహరిస్తోందని వాపోతున్నారు.

మురళీధర రావుకు,రాంమాధమ్‌కు మధ్య విబేధాలు..! అడ్డొచ్చిన ప్రాంతీయ వాదం..!!

మురళీధర రావుకు,రాంమాధమ్‌కు మధ్య విబేధాలు..! అడ్డొచ్చిన ప్రాంతీయ వాదం..!!

ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు ఉండే వారని, ఆయనను పార్టీకి దూరంగా, ఉపరాష్ట్రపతిగా నియ‌మించ‌డంతో తమకు అధిష్టానం వద్ద చెప్పుకుందుకు మనిషే లేకుండా పోయారని అంటున్నారు. మరోవైపు తెలంగాణ నాయకుడు మురళీధర రావుకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాంమాధమ్‌కు మధ్య విబేధాలు రానురాను ఎక్కువవుతున్నాయని, రాం మాధవ్ తమ కంటే తెలంగాణ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నాయకులు చెబుతున్నారు.

ఎన్నిక‌ల వేళ విభేదాలు..! పార్టీకి న‌ష్ట‌మంటున్న‌ సీనియ‌ర్లు..!!

ఎన్నిక‌ల వేళ విభేదాలు..! పార్టీకి న‌ష్ట‌మంటున్న‌ సీనియ‌ర్లు..!!

పార్టీలో సీనియర్లను కాదని కన్నా లక్ష్మీ నారాయణకు అధ్యక్ష పదవి రావడం వెనుకు రాంమాధవ్ రాజకీయాలే కారణమని వారంటున్నారు. దీనికి కారణం తామంతా వెంకయ్య నాయుడి మనుషులమని అధిష్టానం వద్ద ఓ ముద్ర పడేలా చేసారని, దీంతో తమను దూరం పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, పార్టీలో సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో వెలుగు చూస్తున్న లుకలుకలు అధిష్టానానికి మాత్రం ఇబ్బందులు తీసుకువస్తున్నాయనే చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
Along with party president Amit Shah, Parimpuna nanda Swamy joined the party in the presence of Ram Mandhav. The Telangana leaders thought that Swamy would limit the party's growth in the state and the programs in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X