కవితకు బెయిల్ వచ్చింది ఇందువల్లేనట!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో మార్చి 15న కవితను అరెస్టు చేసిన ఈడి ఆమెను విచారించడంతోపాటు కవితను జైలు పాలు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 15వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణం లో సిబిఐ కూడా కవితను అరెస్టు చేసి విచారణ చేపట్టింది. కవిత బెయిల్ తో తెలంగాణా రాజకీయం మారింది.

బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం
సుమారు ఐదున్నర నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. ఫైనల్ గా నేడు సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇక కవితకు బెయిల్ రావడంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

congress and bjp fight about kavitha bail telangana politics changed

కవితకు బెయిల్ వెనుక బీజేపీ అంటున్న కాంగ్రెస్
ఇప్పటికే కవిత కేసును వాదించిన లాయర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారనీ, కాంగ్రెస్ కు కంగ్రాట్స్ అంటూ బండి సంజయ్ పోస్ట్ పెట్టగా కవిత బెయిల్ ఊహించిందే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విలీన ప్రక్రియలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది
తాజాగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కవితకు బెయిల్ వచ్చింది. బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ప్రక్రియ మొదలైంది అంటూ పేర్కొన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూశారని, పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్, బిజెపి కుమ్మకై బీజేపీకి, బీఆర్ఎస్ దాసోహం అయిందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

బిజెపిలో కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయి
హరీష్, కేటీఆర్ ఢిల్లీలో బిజెపి నేతల చుట్టూ ఆపదమొక్కులు మొక్కారని, బిజెపి నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపిలో కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. ఇంకా అదొక్కటే మిగిలింది అంటూ ఆయన తన వీడియోతో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక కవిత బెయిల్ బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+