కేసిఆర్ వ్యాఖ్యలు మతిలేనివి.. : చిన్నారెడ్డి, కేటీఆర్.. వాస్తవాలు తెలుసుకో : దత్తాత్రేయ
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా పలువురు కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో.. ఫిరాయింపులకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న తరహాలో మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
తాజా ఫిరాయింపులపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండడం కోసమే తాము కాంగ్రెస్ నేతలని టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించడమేంటని ప్రశ్నించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతోనే కొనసాగుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్.. వాస్తవాలు తెలుసుకో : దత్తాత్రేయ
రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.
కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించిన ఆయన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను తక్కువ చేసి చూపించడం సరికాదన్నారు. కాగా, రేడియల్ రోడ్ కోసం కేంద్రప్రభుత్వం ఇప్పటికే రూ.80 కోట్లు కేటాయించిందని, దీనికి సంబంధించిన డీపీఆర్ తీసుకుని ఢిల్లీకి వస్తే తాము అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications