కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు - అనూహ్య ఎంపిక..!!

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బిఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడినుంచి తమ పార్టీ అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం బిఆర్ఎస్ కు దక్కింది. కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. బిజెపి నుంచి శ్రీ గణేష్ పోటీలో నిలిచారు. ఆయనకు 41 888 ఓట్లు పోలయ్యాయి. శ్రీ గణేష్ పైన పైన టిఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు.

Congress announces Sri Ganesh as party candidate for secunderabad cantonment by poll

17,169 ఓట్ల మెజార్టీతో గెలుపు దక్కించుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల తో పాటుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.

ఉప ఎన్నికలో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ ను కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. కొద్దిరోజుల క్రితమే శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. అప్పుడే ఆయన పార్టీ అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ ప్రకటన చేసింది.

టిఆర్ఎస్ నుంచి లాస్య నందిత కుటుంబానికి సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. బిజెపి తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సెట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో సాధారణంగా ఆ కుటుంబానికి సీటు కేటాయిస్తూ ఏకగ్రీవం చేయటం కొంతకాలంగా ఆనవాయితీగా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఉప ఎన్నిక పోరు ఖాయంగా మారింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్, బిజెపి పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+