తెలంగాణ రాజకీయాల్లో మంటపెట్టిన ఫేక్ లెటర్..!!
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. రైతుబంధు (Rythu Bandhu) పథకాన్ని అమలుకు చేయడానికి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకోవడం- తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టించింది.. దుమారం రేపుతోంది.
ఈ పథకం కింద మంగళవారం నిధులను జారీ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సమాయాత్తమౌతోన్న సమయంలో ఈసీ నుంచి ఈ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గతంలో ఇచ్చిన అనుమతలను వెనక్కి తీసుకుంది. ఇది కాస్తా బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, విమర్శలు సంధించుకుంటోన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు- ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ రాసిన లేఖల వల్లే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తోంది భారత్ రాష్ట్ర సమితి. దీనికి సంబంధించిన ఓ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. వైరల్‌గా మారింది.
ఈ లేఖపై తెలంగాణ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఎలాంటి లేఖ రాయలేదని వివరణ ఇస్తోంది. బీఆర్ఎస్ నాయకులు ఫేక్ లెటర్‌ను సృష్టించారని, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్నారని మండిపడింది.
రైతు బంధుపై కేంద్ర ఎన్నికల సంఘానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో నేను రాసినట్టు ఫేక్ లేఖ సృష్టించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
ఓటమి భయంతో బీఆర్ఎస్ దిగజారి ఇలాంటి ఫేక్ ప్రచారాలకు పాల్పడుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర…
రైతు బంధును నిలిపివేయడాన్ని తమను బాధ్యులను చేయడానికి బీఆర్ఎస్ పన్నిన కుట్రగా అభివర్ణించింది కాంగ్రెస్. అక్కడితో ఆగలేదు. బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలంటూ పిలుపునిచ్చింది. దీనితో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదురుగా హరీష్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
గాంధీ భవన్ ముందు కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్..!!#KCR #BRS #Congress #TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TSAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/X96JAMMzeA
— oneindiatelugu (@oneindiatelugu) November 27, 2023
ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫేక్ లెటర్‌ను సృష్టించి, తమపై బురదజల్లడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. తాము ఓడిపోతున్నామనే విషయం తెలిసే.. అధికార పార్టీ నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు దిగుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications