నోట్ల రద్దును నిరసిస్తూ ధర్నా
హైదరాబాద్: నోట్ల రద్దుపై అబిడ్స్ చౌరస్తాలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు అంజన్‌కుమార్, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్లధనం వెలికితీతకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నల్లధనం వెలికితీతకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రధానీ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications