Jubilee Hills కాంగ్రెస్ అభ్యర్ధి గా... హైకమాండ్ బిగ్ ట్విస్ట్..!!

తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలైంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఇటు.. జూబ్లీహిల్స్ బై పోల్ కు వచ్చే వారం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. స్థానిక ఎన్నికల పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పు కీలకంగా మారనుంది. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్ధి విషయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ తమ అభ్యర్దిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించారు. బీజేపీ తమ అభ్యర్ధి విషయంలో ముగ్గురి పేర్లు పరిశీలిస్తోంది. ఇక.. కాంగ్రెస్ నుంచి ఈ సీటు కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకట స్వామి, తుమ్మల నాగేశ్వరరావులకు ముఖ్యమంత్రి రేవంత్ బాధ్యతలు అప్పగించారు. అభ్యర్ధి విషయంలోనూ ఈ ముగ్గురి సూచనల మేరకు పార్టీ హైకమాండ్ కు నివేదిక ఇచ్చి.. అభ్యర్ధిని ప్రకటించేలా రేవంత్ వ్యూహాలు సిద్దం చేసారు. ఇదే సమయంలో పలువురు అభ్యర్ధులు తమ పేరు ఖరారు కోసం ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు.

Congress fixed road map for Jubilee hills by poll to announce candidate in next two days

జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు అయిన కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరో వైపు.. టికెట్ తనకు గ్యారెంటీ అని అంజన్ కుమార్ యాదవ్ ధీమాగా ఉన్నారు. మరో వైపు కార్పోరేటర్ సీఎన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా..బీసీ అభ్యర్ధిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ సీటు ఆశించిన అజాహరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి నుంచి రేసు నుంచి తప్పించారు.

ఇప్పుడు ఢిల్లీ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వైపు అభ్యర్దిగా ఖరారు చేసే అంశం పైన సానుకూలత కనిపిస్తున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఈ సీటు కోసం నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.కాగా, అటు ఢిల్లీ నేతలు స్థానిక ఎన్నికలు.. జూబ్లీహిల్స్ బై పోల్ లో ఖచ్చితంగా సానుకూల ఫలితాలు వచ్చేలా పని చేయాలని నిర్దేశించారు. తాజాగా ఏఐసీసీ నేతల చర్చల వేళ ఆశావహుల జాబితా సిద్దం చేయడంతో పాటు వారికి పార్టీతో ఉన్న అనుబంధం గురించి ఆరా తీసింది. మరో రెండు రోజుల్లో పార్టీ తమ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉండటంతో.. చివరి ప్రయత్నాలను అభ్యర్ధులు ముమ్మరం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+