కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చిందా?: జేపీ నడ్డా

తెలంగాణలో గత బీఆర్ఎస్.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు తేడా లేమీ లేదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు.

తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు జేపీ నడ్డా. దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా పాలిస్తోందని, మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి పాలిస్తోందని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో అత్యధిక స్థానాలతో విపక్షంలో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ గెలుస్తుందని జేపీ నడ్డా తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు.

Congress government in Telangana has cheated people JP Nadda

మహారాష్ట్రలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడిందన్నారు. బీజేపీతో నేరుగా తలపడ్డ ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలవలేదని విమర్శించారు.

దేశంలో నెహ్రూ తరవాత మూడోసారి ప్రధాని అయ్యింది నరేంద్ర మోడీనే అని జేపీ నడ్డా తెలిపారు. నెహ్రూ మూడోసారి ప్రధాని అయినప్పుడు ప్రతిపక్షాలు లేవు. ప్రజల ఆశలను నిరాశకు గురి చేసి కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు.

గుజరాత్‌లో బీజేపీ ఆరు సార్లు, నాలుగు సార్లు మధ్యప్రదేశ్, గోవా, హర్యానాల్లో హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష పార్టీలు ఏకమైనప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మంచి ఓట్లు, సీట్లు సాధించింది. కాంగ్రెస్ పరాన్న జీవి పార్టీ తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, బీహార్‌​లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది' అని జేపీ నడ్డా తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్తవ్యస్థం చేశాయని మండిపడ్డారు.

ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు జేపీ నడ్డా. రూ. 15 వేల రైతు భరోసా ఇవ్వలేదన్నారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని మాట తప్పిందని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతు, మహిళా, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని నడ్డా విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని ఇవ్వలేదని జేపీ నడ్డా మండిపడ్డారు. షాదీ ముబారక్ ద్వారా రూ. లక్ష నగదు, తులం బంగారం ఇస్తామని మోసం చేసిందని జేపీ నడ్డా విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+