కొండా మురళి దంపతులపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు?
కొండా సురేఖ, మురళి దంపతులపైన కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తుందా? సొంత పార్టీ నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండా దంపతుల పైన చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికి అంత ఈజీ కాదా? సొంత పార్టీలోని నేతలపైన విమర్శలు చేసిన కొండా దంపతులపై క్రమశిక్షణ కమిటీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కపెట్టడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా అంటే అవునని చెప్పక తప్పదు.
కొండా దంపతుల బలం ఇదే
వరంగల్ జిల్లా రాజకీయాలలో కొండ సురేఖ కొండా మురళి దంపతులకు గట్టిపట్టు ఉంది. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలలో వరంగల్ జిల్లాలో పార్టీకోసం గట్టిగా పని చేయగలిగిన వారు, అవసరమైన చోట అంగ బలాన్ని, అర్థ బలాన్ని ఉపయోగించగలిగిన నాయకులలో కొండ మురళి దంపతులు కీలకమైన వారు. సొంత పార్టీ నేతలతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో అధిష్టానానికి వెన్నుదన్నుగా నిలవడంలో కొండ దంపతులది విభిన్నశైలి.

భయపడేది లేదని తేల్చి చెప్పిన కొండా దంపతులు
పార్టీలోని ఎమ్మెల్యేలపై బాహాటంగా వ్యాఖ్యలు చేసినా, విమర్శలు గుప్పించిన కొండా దంపతులు, వరంగల్ జిల్లా నేతలందరూ మూకుమ్మడిగా వారి పైన ఫిర్యాదు చేసినా, తాము ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. కొండా దంపతుల వ్యాఖ్యల పైన క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తుందని తెలిసిన తర్వాత కూడా కొండా దంపతులు ఏమాత్రం తగ్గకుండా తాము చెప్పదలచుకుంది బల్లగుద్ది మరీ చెప్పారు.
మీనాక్షి నటరాజన్ కు కొండా మురళి హామీ
వారిచ్చిన వివరణలో కూడా జిల్లా పార్టీ నేతల పైన ఫిర్యాదు చేశారు. ఇలా వరంగల్ జిల్లా నేతలందరి పైన కొండా మురళి దంపతులు చేస్తున్న ప్రచ్చన్న యుద్ధంలో వారి ధైర్యం వెనుక జిల్లాలో రాజకీయంగా తమకు ఉన్న పట్టు కారణమని లోకల్ గా చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇటీవల మీనాక్షి నటరాజన్ ను కలిసిన సందర్భంలో కూడా ఆయన కీలక హామీలు ఇచ్చారు.
వారిపై చర్యలకు వెనకడుగు వెనుక కారణం ఇదే
కొండ మురళి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని, ఆర్థికంగానూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. లోకల్ గా ఉన్న తమ పట్టని చూపించడం కోసం భారీ ర్యాలీలతో గాంధీభవన్ కు, మీనాక్షి నటరాజన్ ను కలవడానికి వెళ్లారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొండా దంపతుల పైన చర్యలు తీసుకోవాలంటే అధిష్టానం వెనకడుగు వేస్తుంది.
హెచ్చరించి, వారిని బుజ్జగించే పనిలో అధిష్టానం
ఈ క్రమంలోనే కొండా మురళి దంపతులు ఇచ్చిన వివరణను బేస్ చేసుకుని మళ్లీ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో కీలక నాయకులతో చర్చలు జరుపుతోంది. సాధ్యమైనంతవరకు ఈ వ్యవహారాన్ని చిన్నచిన్న హెచ్చరికలతో కాంప్రమైజ్ చేసే పనిలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొండా మురళి దంపతులపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలకు వెనుకడుగు పడుతోందని సమాచారం.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications