Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ లో అలకలు, బుజ్జగింపుల పర్వం!

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ జరిగిపోయింది. మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కుతుందని భావించిన చాలామంది నేతలకు మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కలేదు. రాష్ట్ర మంత్రులుగా నేడు ముగ్గురు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ లో వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
రాజ్ భవన్ - చారిత్రక దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి Dr జితేందర్, MIM శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, పలువురు పార్లమెంటు, శాసనసభ్యులు వీరి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

congress highcommand appeasing disgruntled mlas those who missed minister posts in cabinet expansion

Take a Poll

నిరాశకు లోనైన కాంగ్రెస్ సీనియర్లు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురూ మొదటి సారి శాసనసభకు ఎన్నికైన వారే కావటం విశేషం. అయితే ఎంతో మంది సీనియర్లు ఈసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో తమకు స్థానం దక్కుతుందని భావించారు. అయితే వారికి కాకుండా మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారికి అవకాశం కల్పించడం వారందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రివర్గంలో చోటు లభించక చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగింపు ప్రక్రియ
ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు,మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తీవ్ర అసహనానికి గురైనట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రి పదవులు దక్కని నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగింపు ప్రక్రియ మొదలు పెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వం.

రంగంలోకి దిగిన మీనాక్షి నటరాజన్
ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి నేతలతో చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు, జూబ్లీహిల్స్ లోని సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి సముదాయించినట్లు తెలుస్తోంది.

అలిగిన వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకులు
కేవలం సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగినట్లు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బేగంపేటలోని ప్రేమ సాగర్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం. ఇక మరోవైపు మల్ రెడ్డి రంగారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడి బుజ్జగించిన దృష్ట్యా ఆయన ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోను మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడి అలిగిన వారిని, బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+