Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ ఆశలు గల్లంతు - బీఆర్ఎస్ కు ఊహించని పరాభవం..!!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యతలో కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హేమా హేమీలు వెనుకంజలో ఉన్నారు. రేవంత్ ను రెండు నియోజకవర్గాల్లో ఓడిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఆశలు నెరవేరేలా లేదు. బీజేపీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారానికి కావాల్సిన 60 సీట్లలో ఆధిక్యతలో ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్యులు ఎదురీదుతున్నారు. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దిగ్గజాలకు కాంగ్రెస్ ఓటమి వైపు నెడుతోంది. తొలి రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అధికారానికి కావాల్సిన 60 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది. సిరిసిల్ల, కామారెడ్డిలో తొలి రౌండ్ లో కేసీఆర్, కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముసిగే సరికి కేటీఆర్ పుంజుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ పోటీలో ఉన్నా..అక్కడ బీజేపీ అభ్యర్దికి లీడ్ కనిపిస్తోంది. కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసే సరికి రేవంత్ 4389 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కామారెడ్డిలో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది.

Congress lead in Kamareddy and Sircilla where KCR and KTR contesting Segments

బీజేపీ అనూహ్యంగా పది స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. హుజూరాబాద్ లో ఈటెల వెనుకంజలో ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్, గోషా మహల్ లో రాజాసింగ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లాను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఖమ్మం జిల్లాలో మిత్రపక్షంతో కలిసి 9 స్థానాల్లో ఆధిక్యతలో నిలిచింది. అంబర్‌పేట్‌లో తొలి రౌండ్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌కి 485 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లం పల్లి, ఖానాపూర్ లో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ లో బీజేపీ అధిక్యంలో ఉంది. ఆసిఫాబాద్, బోథ్ లో బీఆర్ఎస్ అధిక్యం కనిపిస్తోంది. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ 53 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.ఎల్బీనగర్ లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్ రెడ్డి లీడ్

శేరిలింగంపల్లి లో బిఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ ముందంజలో నిలిచారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి 2000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2230 ఓట్లతో ఆధిక్యంతో కొనసాగుతున్నారు. అంబర్ పేట లో బి అర్ ఎస్ ముందంజలో ఉంది. దుబ్బాకలో రఘనందన రావు వెనుకంజలో ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు బీఆర్ఎస్ 37, కాంగ్రెస్ 60, బీజేపీ 9, ఎంఐఎం 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+