చెప్పకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారు: ఎన్నికలపై డీకే అరుణ లంచ్ మోషన్ పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల తాజీ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయంతో శాసన సభను రద్దు చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
Recommended Video


సభ్యులకు సమాచారం ఇవ్వకుండానా?
సభకు సమాచారం ఇవ్వకుండా, 9 నెలలు ముందుగా రద్దు చేయడం సభ్యుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. శాసన సభను సమావేశ పరచకుండా రద్దు చేయడం అంటే సభ్యుల హక్కులను కాలరాయడమేనని డీకే అరుణ పేర్కొన్నారు.

ఏకపక్షంగా రద్దు చేశారు
దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. శాసన సభను సమావేశపరచాలని, కానీ సమావేశపరచకుండా రద్దు చేశారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధం కాబట్టి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

లంచ్ మోషన్ పిటిషన్
ఎన్నికల షెడ్యూల్ పైన ఈ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను డీకే అరుణ తన పిటిషన్‌లో సవాల్ చేశారు. డీకే అరుణ తరఫున ప్రముఖ లాయర్ నిరూప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అందులోనే అసెంబ్లీ రద్దు, సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ లంచ్ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.

ఇప్పటికే ఓటర్ల జాబితాపై పిటిషన్లు, విచారణ
ఇప్పటికే ఓటర్ల జాబితాపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఓటర్ల జాబితాపై పిటిషన్ వేసిన వారిలో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఓటర్ల జాబితాపై ఈసీ సోమవారం కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. అనంతరం హైకోర్టు ఈ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications