వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేత కొండా కి ఊరట..! బెయిల్ మంజూరు చేసిన కోర్ట్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం 25,000 రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సూచించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ 10 లక్షల రూపాయలతో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే..!

Congress Leader Konda relaxation.! Court granted bail..!!

ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంటికి వెళ్లగా, ఆయన తన అనుచరులతో తమను నిర్బంధించారని ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు అరెస్ట్ వారెంట్ నోటీసులు ఇచ్చారు. దీంతో కొండా ముందస్తు బెయిల్ కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించారు. తొలుత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కొండా కి ఊరట లభించినట్టైంది.

English summary
Congress MP Konda Vishweshwar Reddy was given bail in the High Court. The court granted him an advance bail. For this purpose, Rs. 25,000 has been ordered to issue two underwriting. On this occasion, Konda Visvesvara Reddy suggested to coaperate police investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X