కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత నరోత్తమ్
హైదరాబాద్: కొత్త చేరికలతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో గురువారం చేరారు. ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ కండువా కప్పి నరోత్తంను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు.
కాగా, నరోత్తం గతంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, జహీరాబాద్ నియోజకవర్గం మేలు కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు నరోత్తం తెలిపారు.

పలు కార్పొరేషన్లకు ఛైర్మన్‌ల నియామకం
తెలంగాణ ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. డైరెక్టర్లుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్, నారాయణ పేట జిల్లా, మద్దూర్ మండలం, రెనెవట్లకు చెందిన మొహమ్మద్ సలీంలను నియమించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మార్వెల్లికి చెందిన మాటం భిక్షపతిని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మొహమ్మద్ తన్వీర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.












Click it and Unblock the Notifications