'బందిపోటు ముఠాలా కేసీఆర్ కుటుంబం.. ఎవడబ్బ సొమ్మని.. అలా!'

తిరుమలకు రూ.5కోట్ల కానుకలు సమర్పించడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని తిరుమల వెంకన్నకు కోట్లాది రూపాయల కానుకలు సమర్పించారని విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పించారు. సీఎం వ్యవహార శైలితో పాటు పాలనకు సంబంధించిన పలు అంశాలపై వారు విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పాలిట బందిపోటు ముఠాగా అభివర్ణించారు.

కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మల్లు రవిలు శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు చేశారు.

Congress leader takes on KCR over trs ruling

తిరుమలకు రూ.5కోట్ల కానుకలు సమర్పించడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎవడబ్బ సొమ్మని తిరుమల వెంకన్నకు కోట్లాది రూపాయల కానుకలు సమర్పించారని విరుచుకుపడ్డారు. మీ మొక్కులు మీ ఇష్టమని, పేదలు కట్టిన సొమ్ముతో దేవుళ్లకు కానుకలు సమర్పించడమేంటి? అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆవిర్భావం జరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క యూనిట్ విద్యుత్ ను కూడా అదనంగా ఉత్పత్తి చేయలేకపోయారని ఆరోపించారు. ఏయే ఆంధ్రా కాంట్రాక్టర్ నీ ఇంటికి సూట్ కేసులు మోసుకొస్తున్నాడో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కుటుంబం అప్పులు తెచ్చుకోవడం, కమిషన్లు తీసుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కూర్చున్న కుర్చీ కాంగ్రెస్ పుణ్యమే అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+