రాహుల్ గాంధీ సభాస్థలి పరిశీలన.. రేవంత్ రెడ్డి ముందే జంగా, నాయిని వర్గీయుల బాహాబాహీ

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన సందర్భంగా వరంగల్ వేదికగా నిర్వహించనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభను సక్సెస్ చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు సభాస్థలి పరిశీలించడానికి హనుమకొండకు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరగనున్న సభా స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది.

రేవంత్ రెడ్డి ముందే జంగా, నాయిని వర్గీయుల ఘర్షణ

రేవంత్ రెడ్డి ముందే జంగా, నాయిని వర్గీయుల ఘర్షణ

వరంగల్ రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో పరిశీలించడానికి వచ్చిన రేవంత్ రెడ్డి బృందం ఒకవైపున కళాశాల మైదానాన్ని పరిశీలిస్తున్న సమయంలో జంగా వర్గీయులు నాయిని వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నాయిని రాజేందర్ రెడ్డి వర్గీయులు జంగా వర్గీయులమధ్య తోపులాట చోటు చేసుకుంది. జంగా రాఘవరెడ్డి కళ్ళముందే ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది.

వరంగల్ లో నేతల మధ్య విబేధాలు

వరంగల్ లో నేతల మధ్య విబేధాలు

ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కోసం అధిష్టానం దృష్టి సారించి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్క కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాత్రం అంతర్గత కలహాలు పార్టీ ముఖ్య నేతల ముందే బహిర్గతం కావడం పార్టీ వర్గాలలోను, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికిజనగామజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేస్తారా?

రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేస్తారా?

అంతేకాదు వరంగల్ జిల్లాలోని పార్టీ నేతల మధ్య ఎలాంటి సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి ఉంది. అందరూ దిగ్గజ నేతలే కానీ పార్టీ కోసం పని చేసే వారే లేరు అన్న చందంగా పరిస్థితి ఉంది. ఆధిపత్య పోరులో కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని నాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ సభ ఇక్కడ నిర్వహించనున్న నేపధ్యంలో అందరూ కలిసి పని చేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఇక కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఈ సభ సక్సెస్ అవుతుందా లేదా అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

జంగా రాఘవ రెడ్డి వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తాజా పరిణామాలు

జంగా రాఘవ రెడ్డి వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తాజా పరిణామాలు

ఇటీవల నాయిని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పై విరుచుకుపడ్డారు.జంగా రాఘవరెడ్డి హనుమకొండ లో పాగా వేయడం కోసం కొంతమంది కోవర్టులతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనినాయినిరాజేందర్ రెడ్డి ఆరోపించారు. జంగా రాఘవ రెడ్డి లాంటి చిల్లర నాయకులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది అని మండిపడ్డారు. జంగా రాఘవరెడ్డి విషయంలో అధిష్టానం సీరియస్ నిర్ణయం తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం సద్దుమణిగింది అనుకుంటే తాజాగా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే మరోమారు ఇరువర్గాల వారు ఘర్షణకు దిగారు. ఇక ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+