కొండా కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల సంచలన నిర్ణయం..!?

కాంగ్రెస్ లో కొండా వివాదం ముదురుతోంది. కొండా పైన జిల్లాలోని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసారు. తాము కావాలో.. కొండా కావాలో తేల్చి చెప్పాలని డిమాండ్ చేసారు. పార్టీ లో జరుగుతున్న పరిణామాల పై ఢిల్లీకి ఫిర్యాదు చేసారు. పార్టీ అధినాయకత్వానికి తాజా పరిణామా ల పైన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారు. చర్యలు లేకుంటే సంచలన నిర్ణయం దిశగా పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

వరంగల్ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా మురళీ వ్యాఖ్యల తో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ లోని సీనియర్లు కొండాకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఫిర్యాదులు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ కు తమ వైఖరి స్పష్టం చేసారు. తమను అమానించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని డిమాండ్ చేసారు. కొండా దంపతులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని మీనాక్షి నటరాజన్​కు ఫిర్యాదు చేశారు. వారితో సమస్యలు ఎదుర్కుంటున్నామని వాపోయారు.

congress-leaders-ultimatum-for-leadership-over-konda-controversy

పార్టీలో సీనియర్లు.. ఎమ్మెల్యేలపై లెక్క లేని విధంగా కొండా దంపతులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తీరును మీనాక్షీ నటరాజన్ కు వివరించారు. కాగా, తనకు అన్ని విషయాలు తెలుసంటూ మీనాక్షీ చెబుతూనే.. ఎవరూ మీడియా ముందుకు వచ్చి పార్టీ అంతర్గత సమస్యల పైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. విచారణకు పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవిని తన కార్యాలయానికి పిలిపించి మీనాక్షి చర్చించారు. వరంగల్‌ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించ వద్దని స్పష్టం చేసారు. దీంతో, కొండా దంపతులు పైన చర్యలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. చర్యలు లేకుంటే... తాము నేరుగా ఢిల్లీకి వెళ్లేందుకు.. సంచలన నిర్ణయానికి పార్టీ నేతలు సిద్దం అవుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ నేతల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+