• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు, కేసీఆర్ ప‌థ‌కాల‌ను ఓట‌మికి బూచిగా చూపిన కాంగ్రెస్ నేత‌లు..!త‌మ వైప‌ల్యాల‌ను ఒప్పుకోరా..??

|

హైద‌రాబాద్ : ఢిల్లీలో మంగళవారం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, ప్రచార, పబ్లిసిటీ కమిటీల చైర్మన్లు విజయశాంతి, మధుయాష్కీగౌడ్‌ పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేల్లో జగ్గారెడ్డి, ఆత్రం సక్కు మినహా మిగిలిన సభ్యులందరూ పాల్గొన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ తాము రాలేకపోవడానికి కారణాలు వివరించి, పార్టీ అనుమతి తీసుకున్నారు.

తెలంగాణ‌లో ఓట‌మికి కార‌ణాలు తెలుకున్న రాహుల్..! ప‌లు కార‌ణాలు చెప్పిన టీ నేత‌లు..!!

తెలంగాణ‌లో ఓట‌మికి కార‌ణాలు తెలుకున్న రాహుల్..! ప‌లు కార‌ణాలు చెప్పిన టీ నేత‌లు..!!

సమావేశంలోకి రాగానే రాహుల్‌ గాంధీ పార్టీ నేతలను ‘ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం. ఒక్కొక్కరూ చెప్పండి' అని అడిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సీట్ల సర్దుబాటు, టికెట్ల కేటాయింపులో జాప్యం నష్టం కలిగించిందని, ప్రచారానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశమూ ప్రస్తావనకు వచ్చింది. కుసుమ్‌కుమార్‌ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో సాయంత్రం 7 గంటలకల్లా ఎంత శాతం పోలింగ్‌ జరిగిందన్నది అక్కడి ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందని, తెలంగాణలో మాత్రం 30 గంటల సమయం తీసుకున్నారని వివరించారు.

ఖ‌మ్మం నుడి రాహుల్ పోటీ చేయాల‌ని కోరిన పొంగులేటి..! చూద్దామ‌న్న రాహుల్..!!

ఖ‌మ్మం నుడి రాహుల్ పోటీ చేయాల‌ని కోరిన పొంగులేటి..! చూద్దామ‌న్న రాహుల్..!!

చాలాచోట్ల కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయి నాయకులను అధికార పార్టీ కొనేసిందని, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, ఎన్నికలను చంద్రబాబు వర్సెస్‌ కేసీఆర్‌గా ప్రచారం చేసిందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా రాహుల్‌ని ఆహ్వానించారు. గతంలో ఇందిరాగాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు.

 తెలంగాణ లో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కావాలి..! అప్పుడే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న నేత‌లు..!!

తెలంగాణ లో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కావాలి..! అప్పుడే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న నేత‌లు..!!

కేసీఆర్‌తో పోల్చదగ్గ బలమైన నాయకుడు కాంగ్రె్‌సలో లేడని, పార్టీ ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేయలేదని శ్రీధర్‌ బాబు చెప్పారు. పోటీ చంద్రబాబుకు, కేసీఆర్‌కూ మధ్య జరిగిందని, భావోద్వేగాలతో జనం కేసీఆర్‌కు ఓటేశారని పొన్నం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి హర్కార వేణుగోపాల్‌కు రాహుల్‌ సూచించారు. సీట్లు రాకపోవడానికి కారణాలేంటని అడగ్గా, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో టీఆర్‌ఎస్‌ సక్సెస్‌ అయిందని, 5గంటల తర్వాత ఓటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.

బలమైన ఉద్యమాల నిర్మాణం జరగలేదు..! అందుకే పోటీ ఇవ్వ‌లేక పోయామ‌న్న నేత‌లు..!!

బలమైన ఉద్యమాల నిర్మాణం జరగలేదు..! అందుకే పోటీ ఇవ్వ‌లేక పోయామ‌న్న నేత‌లు..!!

ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసేందుకు బలమైన ప్రజా ఉద్యమాలను పార్టీ నిర్మించలేకపోయిందని కొందరు నేతలు తెలిపారు. కేవలం గాంధీభవన్‌లో మీడియా సమావేశాలకు పరిమితమయ్యారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకనైనా పార్టీ తరఫున బలమైన పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆర్గనైజేషనల్ సెటప్ ను మార్చాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అంతే గాని నేత‌లు ఎవ‌క‌వ‌రూ కూడా త‌మ వ‌ల్ల జ‌రిగిన త‌ప్పిదాల‌ను ఒప్పుకోక పోవ‌డం కొస‌మెరుపు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rahul Gandhi met the party MLAs, MLCs and TPCC leaders on Tuesday in Delhi. The meeting was attended by TPCC president Uthamkumar Reddy, CLP leader Malu Bhattivikramaka, Ponnam Prabhakar, Revatha Reddy, Kusumkumar, chairmen of promotions and publicity committees Vijayasantham and Madhuashik Goud. All party members participated in the party MLAs except Jaggareddi and Athram sakku
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more